కర్నూలులో హంద్రీ నదీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక్కెర వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పెంచికలపాడు దగ్గర బ్రిడ్జిపై వరద పోటెత్తింది. ఈ బ్రిడ్జి వద్ద ఉదయం గూడూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. కుందూ నది ఉధృతంగా ప్రవహించింది. కల్వటాల వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించింది. కొండ ప్రాంతాల్లో నుంచి వాగుకు పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో నెల్లూరు-ముంబై హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆత్మకూరు పట్టణంలోని చాలా వీధులు జలమయమయ్యాయి. ఆత్మకూరు మండలంలోని గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించింది. చాగలమర్రి, ప్యాపిలి మండలాల్లో పంటలు నీట మునిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa