జపాన్‌లో వందేళ్లు దాటిన వృద్ధుల సంఖ్య సుమారు లక్షకు చేరింది. సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 99,763 మందికి పెరిగిందని ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. వరుసగా 55వ సంవత్సరం శతాధిక వృద్ధుల సంఖ్య పెరుగుదల కొనసాగుతోంది. ఇందులో 88% మంది మహిళలే ఉండటం విశేషం. ప్రస్తుతం జపాన్‌లో అత్యంత వృద్ధురాలు 114 ఏళ్ల షిగికో కగ్వా కాగా, పురుషుల్లో 111 ఏళ్ల కియోటకా మిజునో అగ్రస్థానంలో ఉన్నారు. సెప్టెంబర్ 15న వృద్ధ దినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేక సత్కారం ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa