సామాన్యులకు శుభవార్త. జీఎస్టీ రేట్లను కేంద్రం ఇటీవల తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 12, 28 శాతం శ్లాబుల్ని ఎత్తేసింది. దీంతో చాలా వస్తువులపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతంలోకి.. 12 శాతం నుంచి 5 శాతానికి చేరాయి. దీంతో వాటిపై రేట్లు తగ్గుతున్నాయి. ఎక్కువగా చిన్న కార్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి చేరడంతో.. ధరలు వీటిపై భారీగా దిగొస్తున్నాయి. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ 18 నుంచి 0 శాతానికి చేరింది. ఇప్పటికే మారుతీ సుజుకీ, హోండా, మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇలా అన్నీ తమ వేర్వేరు మోడళ్లపై ధరల్ని తగ్గించాయి. ఇప్పుడు సామాన్యులకు అదిరిపోయే శుభవార్త అందించింది ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్.
>> ఫుడ్స్, బేవరేజెస్, క్లీనింగ్ ఏజెంట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఇలా ఎన్నో వస్తువుల తయారీలో ఉన్న ఈ సంస్థ కీలక ప్రకటన చేసింది. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల్ని కస్టమర్లకు పూర్తి స్థాయిలో అందించనున్నట్లు ప్రకటించింది. ధరలు తగ్గించిన వాటిల్లో డవ్ షాంపూ, హార్లిక్స్, కిసాన్ జామ్, బ్రూ కాఫీ, లక్స్, లైఫ్‌బాయ్ వంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ధరల తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు ధరల తగ్గింపునకు సంబంధించి.. న్యూస్ పేపర్లలో కూడా ప్రకటన విడుదల చేసింది హెచ్‌యూఎల్. 340 మిల్లీలీటర్ డవ్ షాంపూ బాటిల్.. అంతకుముందు రూ. 490 గా ఉండగా.. ఇప్పుడు రూ. 435 కు దిగొచ్చింది. 200 గ్రాముల హార్లిక్స్ జార్ రూ. 130 నుంచి రూ. 110 కి దిగొచ్చింది.
ప్రొడక్ట్ క్వాంటిటీ పాత ఎంఆర్‌పీ (రూపాయల్లో) కొత్త ఎంఆర్‌పీ
డవ్ హెయిర్ ఫాల్ రెస్క్యూ షాంపూ 340 ml 490 435
క్లినిక్ ప్లస్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ షాంపూ 355 ml 393 349
సన్‌సిల్క్ బ్లాక్ షైన్ షాంపూ 350 ml 430 370
డవ్ సీరమ్ బ్యాడ్ 75g 45 40
లైఫ్‌బాయ్ సోప్ 75g x4 68 60
లక్స్ రేడియంట్ గ్లో సోప్ 75g x4 96 85
క్లోజప్ టూత్‌పేస్ట్ 150g 145 129
లక్మే 9 to 5 pm కాంపాక్ట్ 9g 675 599
కిసాన్ కేచప్ 850g 100 93
హార్లిక్స్ చాకోలేట్ 200g 130 110
హార్లిక్స్ విమెన్స్ ప్లస్ 400g 320 284
బ్రూ కాఫీ 75g 300 270
knorr టొమాటో సూప్ 67g 65 55
హెల్‌మ్యాన్స్ రియల్ మయోన్నైజ్ 250g 99 90
కిసాన్ జామ్ 200g 90 80
బూస్ట్ 200g 124 110
200 గ్రాముల కిసాన్ జామ్ రూ. 90 నుంచి రూ. 80 తగ్గింది. 75 గ్రాముల లైఫ్‌బాయ్ సోప్ ధర రూ. 68 నుంచి రూ. 60 కి తగ్గింది. క్లోజప్ టూత్‌పేస్ట్ 150 గ్రాములపై రూ. 145 నుంచి రూ. 129 కి తగ్గనుంది. ఇక కొత్త ఎంఆర్‌పీ ధరలతో లేదా క్వాంటిటీ పెంపుతో కొత్త స్టాక్‌ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa