కోల్‌కతాలోని ప్రతిష్టాత్మకమైన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఒక యువ గిరిజన మహిళా విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఘటన పీజీ విద్యార్థినిపై గతంలో జరిగిన హత్యాచారం కేసు వివాదం ఇంకా మరువక ముందే జరిగింది. మృతురాలు మాల్దా జిల్లాకు చెందిన మహిళా వైద్య విద్యార్థిగా గుర్తించారు. ఆమె కళాశాల హాస్టల్ గదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన విద్యార్థి సమాజంలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు వెలువడుతున్నాయి.
మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె చనిపోవడానికి కాబోయే భర్తే కారణమని ఆరోపిస్తున్నారు. అతను కూడా అదే కళాశాలలో వైద్య విద్యార్థిగా చదువుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో మృతురాలి కాబోయే భర్తపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, కాలేజీ విద్యార్థులు మృతురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు. ఈ కేసును పూర్తిగా విచారించాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో జరిగిన ఈ సంఘటన భద్రతా లోపాలను, విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేదని నిరూపిస్తోంది. క్యాంపస్‌లో విద్యార్థుల భద్రతకు సంబంధించిన ప్రశ్నలు దీనితో మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా మహిళా విద్యార్థుల భద్రతను ఇది ప్రభావితం చేస్తుంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా ఈ కళాశాలలో భద్రతా సమస్యలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో వైద్య విద్యార్థుల భద్రతకు సంబంధించిన సమస్యలను మరింత తీవ్రం చేసింది. మృతురాలి కుటుంబానికి త్వరితగతిన న్యాయం జరగాలని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ఈ కేసులో పోలీసులు చేస్తున్న దర్యాప్తు ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa