ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రముఖ గాయకుడు, భారతరత్న భూపేన్ హజారికాను కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని, ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ఆదివారం అసోంలోని దర్రాంగ్ జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, "భూపేన్ హజారికాకు భారతరత్న ప్రకటించిన రోజు, 'పాటలు పాడేవారికి, డ్యాన్సులు చేసేవారికా మోదీ భారతరత్న ఇచ్చేది?' అని నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి" అని తెలిపారు. తనను ఎవరైనా దూషించినా తాను శివుడిలా విషాన్ని దిగమింగుతానని, కానీ ఈశాన్య ప్రజలు ఆరాధించే వ్యక్తిని అవమానిస్తే మాత్రం సహించలేనని ఆయన భావోద్వేగంగా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa