ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కేవలం మైదానంలోనే కాదు, ఆటగాళ్ల మానసిక స్థితిలోనూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆడటం ఏ ఒక్క భారత ఆటగాడికి ఇష్టం లేదని, కేవలం బీసీసీఐ ఒత్తిడి వల్లే వారు బరిలోకి దిగారని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడి వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై రైనా ఈ కీలక విషయాలు వెల్లడించాడు. "నాకు తెలిసినంతవరకు, ఆటగాళ్లను వ్యక్తిగతంగా అడిగితే ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఆడటానికి ఎవరూ ఇష్టపడరు. బీసీసీఐ ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అంగీకరించడంతో వారు ఆడక తప్పలేదు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలను అడిగితే, వారు పాకిస్థాన్‌తో ఆడేందుకు నిరాకరించేవారని నేను కచ్చితంగా చెప్పగలను" అని రైనా పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa