సీనియర్ న్యాయవాది బొజ్జా తారాకానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ జె.సుమతి నివాళులర్పించారు. బొజ్జా తారకం 9వ వర్ధంతి సందర్భంగా మంగళవారం హైకోర్టులోని అడ్వొకేట్ అసోసియేషన్ హాలులో సీనియర్ న్యాయవాదులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బొజ్జా తారకం చిత్రపటానికి న్యాయమూర్తులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బొజ్జా తారకం అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, సీనియర్ న్యాయవాదులు ఎ.సత్యప్రసాద్, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa