ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన లేజర్ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థ “Iron Beam”ను విజయవంతంగా పరీక్షించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే, సాంప్రదాయ ఇంటర్‌సెప్టర్ క్షిపణి ప్రయోగం కోసం దాదాపు $50,000 (సుమారు ₹4 మిలియన్లు) ఖర్చవుతుంది. అయితే లేజర్ తాకిడి కోసం అవసరమయ్యే ఖర్చు మాత్రం చాలా తక్కువ. దీని వలన దాడుల వ్యయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా, లక్ష్యాలను వేగంగా, ఖచ్చితంగా ఛేదించవచ్చు.ఇజ్రాయెల్ ఇప్పటికే “Iron Dome” ద్వారా హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటుదారుల నుండి వచ్చే వేలాది క్షిపణులను అడ్డుకుంది. ఇప్పుడు “Iron Beam”తో మరింత అధునాతన వాయు రక్షణను సాధించనుంది.రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అమీర్ బరామ్ మాట్లాడుతూ, “ప్రపంచంలో తొలిసారిగా హై పవర్ లేజర్ వ్యవస్థ పూర్తిస్థాయి కార్యాచరణ సామర్థ్యం సాధించింది” అని చెప్పారు. ఈ ప్రాజెక్టును ఎల్బిట్ సిస్టమ్స్ మరియు రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ కలిసి అభివృద్ధి చేశాయి. రాఫెల్ ఛైర్మన్ యువల్ స్టెయినిట్జ్ దీన్ని “గేమ్ ఛేంజర్”గా అభివర్ణించగా, ఎల్బిట్ CEO బెజలెల్ మాచ్లిస్ మాట్లాడుతూ ఎయిర్‌బోర్న్ లేజర్ టెక్నాలజీపై వారు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించారని వెల్లడించారు.
*ఇజ్రాయెల్ మాదిరిగానే భారత్ ప్రయాణం : ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన లేజర్ టెక్నాలజీని పోలిన విధంగా, భారత్ కూడా లేజర్ ఆధారిత రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో అడుగులు వేస్తోంది. DRDO ఇప్పటికే 30 కిలోవాట్ల లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. ఇది డ్రోన్లు, హెలికాప్టర్లు, క్షిపణులు వంటి వాయు లక్ష్యాలను 5 కిలోమీటర్ల దూరం వరకూ ధ్వంసం చేయగలదు.ఈ ఆయుధం శత్రుదేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలను జామ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. భూమిపై నుంచీ, నౌకలపై నుంచీ దీనిని ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచేందుకు భారత్ విస్తృతంగా కృషి చేస్తోంది.తొలిసారి లేజర్ ఆధారిత యుద్ధ వ్యవస్థలు వాస్తవంలోకి వస్తున్న ఈ తరుణంలో, ఇజ్రాయెల్ మార్గాన్ని అనుసరిస్తూ భారత్ కూడా సాంకేతికంగా శత్రువులపై ఆధిక్యం సాధించడానికి సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa