విశాఖపట్నం రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు నాలుగు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. విశాఖ-గోపాలపట్నం, దువ్వాడ-ఉత్తర సింహాచలం, వడ్లపూడి-గేట్ కేబిన్ జంక్షన్ మార్గాల్లో కొత్త లైన్లు రానున్నాయి. పెందుర్తి-ఉత్తర సింహాచలం మధ్య పైవంతెన నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల ఆలస్యం తగ్గి, రన్నింగ్ టైమ్ కుదించడంతో పాటు వేగం పెరుగుతుందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa