జీఎస్టీ రెండోతరం సంస్కరణలకు మద్దతు తెలిపిన సీఎం చంద్రబాబును అభినందిస్తూ మంత్రి కేశవ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాదాయం తగ్గుతున్నా మొదటగా వాటిని స్వాగతించి, మద్దతు తెలిపినందుకు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ఆదాయానికి రూ.8వేల కోట్లు నష్టం వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్తే... ఆ మేరకు ప్రజలకు లబ్ధి చేకూరుతుంది కదా అని అన్నారని వివరించారు. ఎంతో అనుభవం కలిగిన నాయకుడైన చంద్రబాబు మద్దతివ్వడంతో జీఎస్టీ సంస్కరణలపై అందరిలోనూ ఒక సానుకూల ధోరణి ఏర్పడిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa