ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫైళ్ల దహనం కేసులో ఆర్డీవో మురళి అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 04:25 PM

మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మదనపల్లె పూర్వ ఆర్డీవో మురళిని సీఐడీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఆయనకు గతంలో మంజూరైన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే, గతేడాది జులై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కొన్ని కీలక దస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు, అప్పటి ఆర్డీవో మురళిని నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఆయనకు ఈ ఏడాది జూన్ 2న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, నిన్న ఈ బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు, తిరుపతిలోని ఆయన నివాసంలో ఉన్న మురళిని అదుపులోకి తీసుకున్నారు. మురళి 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లె ఆర్డీవోగా బాధ్యతలు నిర్వర్తించారు. బెయిల్ రద్దయిన 24 గంటల్లోపే ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం. ఈ కేసులో తదుపరి దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa