ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 10:29 AM

AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదలో గల్లంతైన బాలిక(8) యామిని మృతదేహం లభ్యమైంది. మాండవ్య నది వద్ద కంపచెట్ల మధ్య బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నితీష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ వరదల్లో చిక్కుకుని మరో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa