గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులోని సుమారు 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఫిరంగిపురం మండలం మేరికపూడి దగ్గర చోటు చేసుకుంది. ఈ బస్సు రాజస్థాన్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa