అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాదారులపై వార్షిక రుసుం లక్ష డాలర్లు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు, ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు సెప్టెంబరు 21 లోపు అమెరికాకు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు అక్కడే పని కొనసాగించాలని సూచించింది. ట్రంప్ నిర్ణయం ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనల నేపథ్యంలోనే ఈ సూచనలు జారీ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa