సామూహికంగా రైతుల ఫోన్లకు సూచనలు, సలహాలు పంపించే వ్యవస్థను వ్యవసాయ శాఖ రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార యాజమాన్య వ్యవస్థ.. ఏపీ ఎయిమ్స్-2.0 అని దీనికి పేరు పెట్టింది. దీనిద్వారా ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంక్షిప్త సందేశాలను ‘బల్క్ ఎస్‌ఎంఎస్ పుష్’ ప్రక్రియద్వారా పంపుతారు. శనివారం ఆ శాఖ డైరెక్టర్ డిల్లీరావు ఈ ప్రక్రియను ప్రారంభించారు. వాసర్ లాబ్స్ అభివృద్ధి చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా రియల్ టైమ్‌లో రైతులకు ఎస్‌ఎంఎస్‌లు రానున్నాయి. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లకే ఈ ఎస్‌ఎంఎస్‌లు పరిమితం కాకుండా, సాధారణ ఫోన్లకు కూడా వస్తాయని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa