అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్1బి వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు వాటి ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. దీంతో భారత టెక్ కంపెనీలు, ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో, ఎల్ టిఐ మైండ్ ట్రీ భారీగా ప్రభావితమయ్యాయి. ఈ నిర్ణయంతో సోమవారం మార్కెట్లు ప్రారంభం కాగానే టాప్ ఐటీ సేవల కంపెనీల షేర్లు దాదాపు 6 శాతం పడిపోయాయి. దీంతో ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.63వేల కోట్ల మేర ఆవిరైపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa