ప్రభుత్వం దేశవ్యాప్తంగా GST సంస్కరణలను అమలు చేసింది. సెప్టెంబర్ 22 నుంచి విస్తృత శ్రేణి వస్తువులు, సేవలపై ప్రజలకు గణనీయమైన ఉపశమనం లభిస్తోంది.పాలు, నెయ్యి, నూనెతో పాటు టీవీలు, ఏసీలు, కార్లు, బైకుల ధరలు తగ్గినా, జీవిత మరియు ఆరోగ్య బీమాపై మాత్రం GSTని పూర్తిగా రద్దు చేశారు. అంటే ఇవి ఇప్పుడు పన్ను రహిత వర్గంలోకి వచ్చాయి. దీంతో పాలసీదారుల ప్రీమియం చెల్లింపులు తగ్గి, నెలవారీ భారం కూడా తగ్గనుంది. రూ.10,000 లేదా రూ.30,000 ప్రీమియం చెల్లించేవారికి ఎంత పొదుపు వస్తుందో చూద్దాం.కొత్త GST వ్యవస్థ కింద, అవసరమైన వస్తువులు, సేవలపై 5% మరియు 18% రేట్లు మాత్రమే అమల్లోకి వచ్చాయి. గతంలోని 12% మరియు 28% స్లాబ్‌లు పూర్తిగా తొలగించబడ్డాయి. ముఖ్యంగా బీమాపై 18% GSTని సున్నాకి తగ్గించడం ద్వారా ప్రభుత్వం పాలసీదారులకు పెద్ద ఉపశమనం కల్పించింది.2017 జూలై 1న GST అమల్లోకి వచ్చిన తర్వాత, బీమా ప్రీమియం పన్నులో ఇది మొదటి పూర్తి మినహాయింపు. ఈ మార్పు వ్యక్తిగత ULIPలు, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లు, సీనియర్ సిటిజన్ ప్లాన్‌లు, టర్మ్ ప్లాన్‌లన్నింటికి వర్తిస్తుంది.
*ప్రీమియం పొదుపు లెక్కలు :ఉదాహరణకు, మీ నెలవారీ బేస్ ప్రీమియం రూ.30,000 అయితే, గతంలో 18% GSTగా రూ.5,400 అదనంగా చెల్లించాల్సి వచ్చేది. అంటే మొత్తం రూ.35,400. ఇప్పుడు GST రద్దు కావడంతో, కేవలం రూ.30,000 మాత్రమే చెల్లిస్తారు. అదే రూ.10,000 ప్రీమియంపై, పాలసీదారులు నేరుగా రూ.1,800 సేవ్ చేసుకుంటారు.కుటుంబ ఫ్లోటర్ ప్లాన్ విషయంలోనూ గణనీయమైన పొదుపు ఉంటుంది. ఉదాహరణకు, నాలుగు మందితో ఉన్న కుటుంబానికి రూ.10 లక్షల కవర్‌కి సగటు వార్షిక ప్రీమియం రూ.25,000. గతంలో దీనిపై రూ.4,500 GST జోడించి మొత్తం రూ.29,500 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు GST లేకుండా నేరుగా రూ.25,000కే కవర్ అందుతుంది.
*ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) సమస్య:బీమా ప్రీమియంలపై GSTని మినహాయించినప్పటికీ, ప్రభుత్వం బీమా కంపెనీల ITC హక్కులను తగ్గించింది. సెప్టెంబర్ 22 నుంచి కమీషన్లు, బ్రోకరేజ్, మార్కెటింగ్ ఖర్చులపై చెల్లించే GSTను ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌గా క్లెయిమ్ చేయలేరని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ స్పష్టం చేసింది.మునుపటి వరకు కంపెనీలు ప్రీమియంలపై వసూలు చేసిన GSTకి వ్యతిరేకంగా ఈ ఖర్చులను సర్దుబాటు చేసేవి. కానీ ఇకపై ఆ అవకాశమే లేకుండా పోయింది. దీంతో ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల, బీమా సంస్థలు అదనపు భారం కస్టమర్లపై మోపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa