ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్ధరామయ్య మైసూరు దసరా వేడుకల ప్రారంభోత్సవంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

national |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 09:16 PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరు దసరా వేడుకల ప్రారంభోత్సవంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై ప్రసంగిస్తుండగా, ప్రేక్షకులలో కొందరు గందరగోళం సృష్టించడంతో ఆయన సహనం కోల్పోయారు. సభకు అంతరాయం కలిగిస్తున్న వారిపై వేదికపై నుంచే గట్టిగా అరుస్తూ హెచ్చరికలు జారీ చేశారు.కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోలేరా కింద కూర్చోండి. ఎవడ్రా అది ఒక్కసారి చెబితే అర్థం కాదా అసలు ఇక్కడికెందుకు వచ్చారు ఇంట్లోనే ఉండాల్సింది" అంటూ సిద్ధరామయ్య తీవ్ర స్వరంతో మందలించారు. అంతటితో ఆగకుండా, అక్కడే ఉన్న పోలీసు అధికారిని పిలిచి, "పోలీస్, వాళ్లను బయటకు వెళ్లనివ్వొద్దు. అరగంట, గంట సేపు కూర్చోలేనప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు ఎందుకు వస్తారు అని ఆదేశించారు. ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.మైసూరులో 11 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ఏడాది ప్రారంభోత్సవం మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గ్రహీత, రచయిత్రి భాను ముస్తాక్‌ను ప్రారంభోత్సవానికి ఆహ్వానించడాన్ని బీజేపీ నేతలు, మరికొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. గతంలో భాను ముస్తాక్ కన్నడ భాషను 'భువనేశ్వరి దేవత'గా పూజించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని, ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడమే ఈ వివాదానికి కారణమైంది. ఆమె వ్యాఖ్యలు హిందూ, కన్నడ వ్యతిరేకమని ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ విమర్శలపై భాను ముస్తాక్ స్పందిస్తూ, తన పాత ప్రసంగంలోని కొన్ని భాగాలను మాత్రమే కత్తిరించి, వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు.ఈ వివాదంపై సీఎం సిద్ధరామయ్య గట్టిగా స్పందించారు. తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, "దసరా ఏ ఒక్క మతానికో, కులానికో చెందిన పండుగ కాదు, ఇది ప్రజలందరి పండుగ" అని స్పష్టం చేశారు. "భాను ముస్తాక్ పుట్టుకతో ముస్లిం మహిళ కావచ్చు, కానీ అంతకంటే ముందు ఆమె ఒక మనిషి. మనుషుల మధ్య ప్రేమ, గౌరవం ఉండాలి కానీ కులం, మతం పేరిట ద్వేషం ఉండకూడదు" అని ఆయన హితవు పలికారు. మన రాజ్యాంగం లౌకికమైనదని, భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పదనమని సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారని ఆయన అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa