ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉల్లి రైతుల‌కు హెక్టార్‌కు రూ.3 ల‌క్ష‌ల పరిహారం ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 04:01 PM

న‌ష్ట‌పోయిన ఉల్లి రైతుల‌కు హెక్టార్‌కు రూ.3 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సోమ‌వారం శాస‌న మండ‌లిలో ఆయ‌న మాట్లాడుతూ..` కూట‌మి ప్ర‌భుత్వం రైతుల్ని మోసం చేస్తోంది.  ఉల్లి పంటను ఈ ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌డం లేదు. పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేక ఉల్లి రైతుకు పెట్టుబడి కూడా చేతికి అంద‌డం లేదు. కూటమి పాలన లో ఏ పంటకు మ‌ద్ద‌తు ధర లేదు. ఈ ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఆచరణ మాత్రం లేదు. హెక్టార్‌కు రూ. 50వేలు ప‌రిహారం ఇస్తామ‌న్న ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న స‌రికాదు. అంటే ఎకరాకు 20వేలు మాత్ర‌మే అవుతుంది. ఈ లెక్క‌న రైతు భారీగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. గ‌త ప్రభుత్వంలో రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇచ్చి ఆదుకున్నాం. ఈ ప్ర‌భుత్వంలో రైతుల కోసం ఉద్య‌మిస్తుంటే అక్ర‌మ కేసులు పెట్టి వేధిస్తోంది` అని రామ‌సుబ్బారెడ్డి మండిప‌డ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa