మంగళవారం రాత్రి గోదావరి వరద అకస్మాత్తుగా పెరగడంతో, గుండేటివాగు వంతెనపై నీరు పెరిగి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. ఇదే క్రమంలో దాచారంలో పురుగుల మందు దుకాణంలో పనిచేసే ఓ యువకుడు కుక్కునూరు వెళ్తూ, ద్విచక్ర వాహనంతో సహా వంతెన పైనుంచి నీటిలో పడిపోయాడు. అదృష్టవశాత్తు, అదే దారిలో వెళ్తున్న మరికొందరు వాహనదారులు గమనించి, వెంటనే అతన్ని, అతని వాహనాన్ని నీటిలోంచి బయటకు తీశారు. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు అప్రమత్తమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa