ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పోస్టాఫీస్ పొదుపు పథకాలకు ఇప్పటికీ పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండియా పోస్ట్ ఈ-పాస్‌బుక్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వివరాలను ఆన్‌లైన్‌లో లేదా మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి అకౌంట్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లోకి వస్తాయని ఇండియా పోస్ట్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa