2025 మొదటి అర్ధభాగంలో బంగారం, వెండి పెట్టుబడిదారులను ఆకట్టుకున్నాయి. బంగారం 26%, వెండి 22% పెరిగాయి. ఇప్పుడు క్రిప్టోకరెన్సీలు, ముఖ్యంగా బిట్‌కాయిన్ 21 మిలియన్ల సరఫరా పరిమితితో ఆకర్షణీయంగా మారాయి. 2022-2024 మధ్య బంగారం 67%, బిట్‌కాయిన్ 400% పెరిగాయి. 2025లో బంగారం ద్రవ్యోల్బణం, బిట్‌కాయిన్ సాంకేతికతతో దూసుకుపోతున్నాయి. ఈక్విటీల్లో 60-70%, బంగారం-వెండిలో 10-15%, క్రిప్టోలో 3-10% పెట్టుబడి పెట్టడం మంచిదని జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ తెలిపారు. పెట్టుబడిదారులు రూపీ కాస్ట్ యావరేజింగ్, పారదర్శక ప్లాట్‌ఫారమ్‌లు, త్రైమాసిక రీబ్యాలెన్సింగ్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa