AP: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 6 నుంచి తరగతులు పునఃప్రారంభమవుతాయి. దాంతో విద్యార్థులు శనివారం నుంచే ఇళ్లకు బయలుదేరి వెళ్లారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ నూజివీడు డిపో అధికారులు ట్రిపుల్ ఐటీ నుంచి 41 బస్సులు ఏర్పాటు చేసి దూర ప్రాంతాల విద్యార్థులను వారి గమ్యస్థానాలకు చేర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa