పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని రైలు కింద పడి ప్రేమ జంట బలవన్మరణం. గుంటూరు ఎన్ఆర్ఐఐటీ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతూ, కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న గోపికృష్ణ(20), లక్షీ ప్రియాంక(20). పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, తమకు రక్షణ కల్పించాలని ఈ నెల 5న పట్టాబిపురం పోలీసులను ఆశ్రయించిన ఈ ప్రేమ జంట. ఇరువురి తల్లిదండ్రులను పిలిపించగా, వారు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, తాము సొంతంగా తమ కాళ్లపై బ్రతుకుతామని వెళ్ళిపోయిన ప్రేమ జంట. ఈలోగా ఏం జరిగిందో ఏమో, ఈ నెల 27న గుంటూరు నుండి మార్కాపురం వైపు వెళ్లే రైలుకు ఎదురుగా వెళ్ళి నిలబడి బలవన్మరణానికి పాల్పడిన గోపికృష్ణ. ఈ విషయం తెలిపి మరుసటి రోజు అదే ప్రాంతంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీ ప్రియాంక. ప్రేమ విషయంలో మనస్తాపంతో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చిన రైల్వే పోలీసులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa