దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi Airport) ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచేందుకు కొత్త సాంకేతిక వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. రేపటి నుంచి ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్ (E-Arrival Card System) అధికారికంగా అమల్లోకి రానుంది.ఇప్పటి వరకు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులు పేపర్ ఫారమ్‌లలో తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉండేది. ఈ ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో పాటు, ఎక్కువ మంది క్యూల్లో నిలబడే పరిస్థితులు ఏర్పడేవి. అయితే, కొత్త వ్యవస్థ ద్వారా ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోకి రాకముందే ఆన్‌లైన్‌లో వివరాలు నింపి సమర్పించుకునే అవకాశం కలుగుతుంది. దీంతో పేపర్ వాడకం గణనీయంగా తగ్గడం మాత్రమే కాక, సమయనష్టాన్ని కూడా నివారించవచ్చు అని అధికారులు తెలిపారు.ఈ కొత్త సిస్టమ్ ద్వారా ప్రయాణికులు తమ వివరాలను విమానం రాబోయే మూడు రోజుల ముందే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు. అంటే, విమాన ప్రయాణానికి సిద్ధమయ్యేటప్పుడు ఈ-అరైవల్ కార్డ్ ఫారమ్‌ను ముందుగా నింపి పంపితే, ఎయిర్‌పోర్టులో తిరిగి ఫారమ్ నింపాల్సిన అవశ్యం ఉండదు. క్యూలు తగ్గడంతో భద్రతా తనిఖీలలో సమయపాలన మెరుగుపడుతుంది. అలాగే, పేపర్ వాడకం తగ్గడం వల్ల పర్యావరణ పరిరక్షణకు సహాయపడుతుంది. పేపర్‌లెస్ సిస్టమ్ వలన డేటా ఎంట్రీలోపాలు కూడా తగ్గి, సమాచారాన్ని అధికారులు తక్షణమే అందరికీ అందజేయగలుగుతారు.ఇప్పటికే థాయ్లాండ్, ఇండోనేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా వంటి పలు దేశాలలో ఈ-అరైవల్ సిస్టమ్ విజయవంతంగా అమలవుతోంది. ఈ విధంగా భారత్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సౌకర్యాన్ని అందించడాన్ని భారతీయ ఎయిర్‌పోర్టులు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైనవిగా నిలవడం అని చెప్పొచ్చు. దీన్ని ద్వారా దేశంలోకి వచ్చే విదేశీ పర్యాటకులు, వ్యాపారవేత్తలకు చాలా సౌకర్యం కలుగుతుంది.ఆధునిక సాంకేతికతను వినియోగించి సమయాన్ని, వనరులను ఆదా చేయడం ద్వారా ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర విమానాశ్రయాలకు ఆదర్శంగా నిలవనున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa