ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే రాజీనామా: జమ్మూకాశ్మీర్ సీఎం

national |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 11:33 AM

జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా కోసం తాను రాజకీయంగా రాజీపడబోనని సీఎం ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే రాష్ట్ర హోదా ఇస్తామని అంటే, సీఎం పదవికి రాజీనామా చేస్తానని, ఆ పార్టీతో కలవబోనని మంగళవారం అనంతనాగ్ జిల్లాలోని అచాబల్ ఏరియాలో జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు. "బీజేపీతో పొత్తు పెట్టుకుని, ప్రభుత్వంలో దానికి భాగస్వామ్యం కల్పిస్తే బహుశా కాశ్మీర్​కు రాష్ట్ర హోదా తొందరగా వస్తుందేమో. కానీ, దానికోసం నేను రాజకీయంగా రాజీ పడలేను. ఒకవేళ దానికి మీరు సిద్ధపడితే చెప్పండి. నేను రిజైన్​చేస్తా" అని ఆయన వ్యాఖ్యనించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa