ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎల్లుండి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో వివిధ కీలక అంశాలపై మంత్రులు చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై పలు కీలక అంశాలు చర్చించనున్నారు. ఈ నెల 16వ తేదీన ప్రధాని మోడీ రాష్ట్రానికి రాకున్నారు. పర్యటనలో ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించనున్నారు.
ప్రధాని పర్యటన తర్వాత, జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) గురించి అవగాహన కల్పించేందుకు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జీఎస్టీ విధానంపై స్పష్టత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే, జీఎస్టీ అమలుకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం వరుస కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమాలలో ఈ ర్యాలీ కీలక భాగంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa