అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో ఈ ఉదయం(బుధవారం) అద్బుత ఘట్టం ఆవిష్కృతమైంది. మూల విరాట్‌ను సూర్య కిరణాలు తాకాయి. ఇవాళ్టి కిరణ స్పర్శ సందర్భంగా ఆ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయానికి మారే సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారికి ఏడాదిలో రెండు సార్లు కిరణ స్పర్శ జరుగుతుంది. సుమారు 6 నిమిషాలు పాటు స్వామి వారి పాదాలు నుండి శిరస్సు వరకు కిరణ స్పర్శ జరిగింది. ప్రతీ ఏటా అక్టోబర్ 1, 2, మార్చి 9,10 తేదీల్లో సూర్య కిరణాలు స్వామి వారి పాదాలు తాకడం ఆనవాయితీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa