విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ పండుగ, ప్రజలందరిలో ధైర్యం, వివేకంతో ముందుకు సాగే స్ఫూర్తిని నింపాలని ఆయన ఆకాంక్షించారు.గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా మోదీ తన సందేశాన్ని పంచుకున్నారు. "అసత్యంపై సత్యం, చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి నిలువెత్తు నిదర్శనం. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ధైర్యం, వివేకం, భక్తి మార్గంలో నిరంతరం ముందుకు సాగే స్ఫూర్తిని పొందాలని కోరుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మోదీ తన పోస్ట్‌లో రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa