ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) తన సేవలను ఆధునికీకరించే దిశగా మరో కీలక అడుగు వేసింది. ఇకపై ఫిజికల్ సిమ్ కార్డులు లేకుండానే సేవలు పొందేందుకు వీలుగా ఇ-సిమ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం టాటా గ్రూప్‌కు చెందిన టాటా కమ్యూనికేషన్స్‌తో గురువారం ఒక కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల స్వదేశీ 4జీ సేవలను ప్రారంభించిన బీఎస్‌ఎన్‌ఎల్, ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీతో వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, టాటా కమ్యూనికేషన్స్‌కు చెందిన 'మూవ్' అనే అత్యాధునిక ప్లాట్‌ఫాం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ ఇ-సిమ్ సేవలను అందిస్తుంది. కనెక్షన్ యాక్టివేషన్ నుంచి నిర్వహణ వరకు పూర్తి బాధ్యతను ఈ ప్లాట్‌ఫాం చూసుకుంటుంది. ఈ కొత్త విధానంతో వినియోగదారులు సిమ్ కార్డు కోసం స్టోర్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం ఒక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తమ మొబైల్ ఫోన్‌లలో సులభంగా బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa