ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపనున్న ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 06:04 PM

రాష్ట్రంలో సోషల్ మీడియా నియంత్రణ, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్ మీడియాకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలు, నిబంధనలను సమీక్షించడం, జవాబుదారీతనం, అమలులో ఉన్న లోపాలను గుర్తించడం ఈ కమిటీ ప్రధాన విధి. అంతేకాకుండా, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతలు, యూజర్ల రక్షణకు అవసరమైన చర్యలను ఈ మంత్రుల బృందం ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa