చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విగ్రహం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతో స్థానిక దళిత సంఘాలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళిత నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం దళితుల ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa