చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. దోషులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జాతీయ నాయకుల విగ్రహాలకు అవమానం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa