ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ వింత దూడ జన్మించింది. అసాధారణంగా ఈ దూడకు రెండు తలలు ఉన్నాయి. జిల్లాలోని పొదిలి మండలం గురవాయపాలెంలో చోటుచేసుకుందీ ఘటన. రైతు అన్నపురెడ్డి వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో పెంచుకుంటున్న గేదె ఇటీవల ఓ దూడకు జన్మనిచ్చింది.అయితే, దూడకు రెండు తలలు ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యానని, వెంటనే పశువైద్యుడు బ్రహ్మయ్యకు సమాచారం అందించానని వెంకటరెడ్డి తెలిపారు. దూడను, గేదెను పరిశీలించిన బ్రహ్మయ్య.. జన్యుపరమైన లోపాల వల్ల అత్యంత అరుదుగా ఇలాంటి దూడలు పుడతాయని చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు తలల దూడ ఆరోగ్యంగానే ఉందని వివరించారు. కాగా, ఈ వింత దూడను చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa