అరేబియా సముద్ర తీరంలో నౌకాశ్రయ నిర్మాణం కోసం పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా అధికారులను సంప్రదించినట్లు సమాచారం. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల అమెరికాలో పర్యటించిన సమయంలో ఈ ప్రతిపాదనలు చేసినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.ఆంగ్ల మాధ్యమాల కథనాల ప్రకారం, అరేబియా సముద్ర తీరంలో ఓడరేవు నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను అసిమ్ మునీర్ అమెరికా అధికారుల ముందు ఉంచారు. మునీర్ శ్వేతసౌధానికి వెళ్ళడానికి ముందే ఆయన సలహాదారు అమెరికా అధికారులతో ఈ విషయంపై చర్చలు జరిపారు.పాకిస్థాన్‌లోని పాస్నీలో లభించే కీలక ఖనిజాల రవాణాకు ఈ ఓడరేవును ఉపయోగించాలని షరీఫ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాస్నీ ఓడరేవు పట్టణంగా ఉంది. అయితే, అరేబియా సముద్ర తీరంలో నిర్మించ తలపెట్టిన ఓడరేవును అమెరికా సైనిక స్థావరాల కోసం ఉపయోగించడానికి పాకిస్థాన్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa