విమానయాన సంస్థ ఇండిగోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పైలట్ల శిక్షణ విషయంలో కీలక నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఇండిగో సంస్థకు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) రూ. 20 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం, కేటగిరీ-సి ఏరోడ్రోమ్‌లలో పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు నిర్దేశిత ప్రమాణాలు కలిగిన సిమ్యులేటర్లను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 26న తమకు ఈ మేరకు డీజీసీఏ నుంచి ఆదేశాలు అందినట్లు కంపెనీ తన ఫైలింగ్‌లో వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa