విజయవాడ-సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీసును ఇండిగో సంస్థ మరి కొద్ది రోజుల్లో ప్రారంభించనుంది. ఈ సేవను విజయవాడ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.విజయవాడ నుండి వారానికి మూడు రోజులు మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉండనుందని, నవంబర్ 15 నుండి ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ నుండి సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయానికి వారానికి మూడు సార్లు నేరుగా ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ ఏడాది జూలై 28న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చిందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ప్రవాసాంధ్రుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోనే ఈ సర్వీసును ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa