ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షుగర్ ఉన్నవారు ఏం తినాలో కాదు, ఏం తినకూడదో కూడా తెలుసా

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 09:07 PM

షుగర్ ఉన్నవారు సమస్యని తగ్గించుకోవాలనుకుంటే కొన్ని ఫుడ్స్‌కి కచ్చితంగా దూరంగా ఉండాలి. అంటే పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. కంట్రోల్ చేసుకుంటే మంచిది. అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. కొన్ని ఫుడ్స్ హెల్దీ అనిపించినప్పటికీ ఆరోగ్యంపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ప్రోటీన్ మంచిదనిపించినప్పటికీ అందులో రెడ్ మీట్, బీఫ్ వంటి ఫుడ్స్ సమస్యని మరింతగా పెంచుతాయి. కాబట్టి, తినే ముందు ఏం తినాలి, ఏం తినకూడదని తెలుసుకుని తినడం మంచిది. ఎందుకంటే కొన్ని ఫుడ్స్ షుగర్ లెవల్స్‌ని అమాంతం పెంచుతాయి. నేచురల్‌గానే సమస్యని కంట్రోల్ తగ్గించేందుకు కొన్ని ఫుడ్స్‌కి కూడా దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా, మనకి కొన్ని హెల్దీ ఫుడ్స్ అని ప్రోటీన్, వెజిటేబుల్స్ అని చెబుతారు. అయితే, వాటిని కూడా కొన్ని రకాల ఫుడ్స్‌ని కూడా అసలే తీసుకోవద్దు. అలాంటి కొన్ని ఫుడ్స్ గురించి న్యూట్రిషనిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. అవేంటంటే


కొబ్బరినూనె


కొబ్బరినూనె ఎంత ఆరోగ్యకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైట్ చేసేవారికి దీనిని చాలా మంది సజెస్ట్ చేస్తారు. ఇప్పుడిప్పుడే చాలా మంది దీనిని రెగ్యులర్‌గా వంటకాల్లో యాడ్ చేస్తన్నారు. అయితే, కొబ్బరినూనె ఎంత హెల్దీ అయినప్పటికీ కండరాల కణాలలో పేరుకుపోయే సంతృప్త కొవ్వుతో నిండి ఉంటుంది. దీంతో ఇన్సులిన్ దాని పనిని చేయకుండా అడ్డుకుంటుంది. కాబట్టి, కొబ్బరినూనెని తగ్గించి తీసుకోవడం మంచిది. అదే విధంగా, వైట్ రైస్, బ్రెడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రై చేసిన కూరగాయలు తీసుకోవద్దు.


పేస్ట్రీస్, కేక్స్


​ప్రాసెస్డ్ చేసిన పిండి, షుగర్‌తో చేసే ఈ ఫుడ్స్ కొవ్వుతో నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ , ఇన్సులిన్ నిరోధకతని మరింతగా దిగజార్చుతాయి. కాబట్టి, ఇలాంటి పేస్ట్రీస్, కేక్స్‌ని తీసుకోకపోవడమే మంచిది. వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. సోడియం ఎక్కువగా ఉండే బటర్, చీజ్, సాస్ కలిపిన కూరగాయలు, ఊరగాయల వంటివి తీసుకోవద్దు.


కొవ్వు ఎక్కువగా ఉండే మీట్


మీట్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కణాల లోపల కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. రోజులు గడిచేకొద్దీ షుగర్‌ని ఎక్కువగా పెంచుతుంది. దీంతో పాటు మార్కెట్లో దొరికే ఎక్కువగా తియ్యగా ఉండే పండ్లు, ఫ్రూట్ రోల్స్, ప్లెయిన్ జామ్, జెల్లీ, ప్రిజర్వేటివ్స్ ఉండే ఫుడ్స్, తీపి పండ్లతో తయారైన గమ్మీస్ వంటి వాటికి దూరంగా ఉండాలి. రెడ్ మీట్, హాట్ డాగ్స్, సాసేజెస్, లివర్ వంటి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. ఫ్రైడ్ మీట్ కూడా తీసుకోవద్దు.


స్వీట్ డ్రింక్స్


షుగర్ ఎక్కువగా వేసి తయారుచేసిన డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఒకేసారి రక్తంలో షుగర్‌ని పెంచుతుంది. కొవ్వుతో నిండి ఉంటుంది. వీటి బదులు హెల్దీ డ్రింక్స్ తీసుకోవాలి. క్రీమ్, షుగర్‌తో తయారయ్యే కాఫీ, చాక్లెట్ డ్రింక్స్, తియ్యని టీ, జ్యూస్, సాధారణ సోడా, సాధారణ స్పోర్ట్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటి షుగర్ యాడెడ్ డ్రింక్స్‌ని తగ్గించాలి. ఆల్కహాల్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు.


షుగర్ లెవల్స్ పెంచే ఫుడ్స్


ఫ్రైడ్ ఫుడ్స్


చిప్స్, పూరీలు, బజ్జీలు ఇవి తినడానికి ఎంత బాగుంటాయో వీటిని తినడం వల్ల అంతే సమస్యలు వస్తాయి. వీటి వల్ల ఆయిల్ ఆక్సీకరణ, ట్రాన్స్ ఫ్యాట్స్ వాపుని ప్రేరేపిస్తాయి. ఇన్సులిన్‌కి ప్రతి స్పందించే కణాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. నూనెలో ఫ్రై చేసిన ఫుడ్స్, మీట్స్, మేక, గొర్రె, హాట్ డాగ్స్ వంటివి తినకపోవడమే మంచిది. ఇవి షుగర్ ఉన్నవారికే కాదు, లేని వారికి కూడా రిస్క్‌ని పెంచుతాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa