జపాన్‌లో ఫ్లూ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా 4,030 మంది ఫ్లూ బారిన పడ్డారు. ఒకినావా, టోక్యో, కగోషిమాలలో కేసులు అధికంగా ఉన్నాయి. పిల్లలలో ఇన్‌ఫ్లుఎంజా వ్యాప్తి కారణంగా 100కి పైగా పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు మూసివేశారు. అక్టోబర్ 3 వరకు 4,000 మందికి పైగా ఆసుపత్రుల్లో చేరారు. ఈ ఏడాది ఫ్లూ సీజన్ ముందుగానే ప్రారంభమైంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, టీకాలు వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్లూ కారణంగా ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa