డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-6ను పరీక్షించేందుకు భారత్ సిద్ధమైందా..? బంగాళాఖాతంలో 3,550 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ నోటమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేయడంతో.. అగ్ని-6 పరీక్షకు రెడీ అయినట్టే అనిపిస్తోంది..! నోటమ్ జారీచేసిన ఈ ప్రాంతంలోకి 15 నుంచి 17 వరకు... అంటే 72 గంటలపాటు విమానాలు గానీ, నౌకలు గానీ ప్రవేశించకుండా నిషేధం అమలులో ఉంటుంది. 3,550 కిలోమీటర్ల మేర నోటమ్‌ను జారీ చేయడంతో.. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీబీఎం) అగ్ని-6 పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. భారత్ వద్ద ఉన్న అగ్ని-5.. క్షిపణికి 5వేల కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. వాస్తవానికి ఇటీవల ప్రభుత్వం జారీచేసిన నోటమ్ జోన్‌ను మూడుసార్లు సవరించారు. ఈ నెల 6న నోటమ్‌లో నో ఫ్లై జోన్ పరిధిని 1,480 కి.మీ.గా ప్రకటించగా.. ఆ మరుసటి రోజే దాన్ని 2,520 కి.మీ.కి పెంచారు. తాజాగా దాన్ని ఏకంగా 3,550 కి.మీ.కి పెంచారు. దీంతో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి సిద్ధమై ఉండొచ్చని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa