ముఖ్యమంత్రి చంద్రబాబు మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల ఆయన లండన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు అధికారికంగా ధృవీకరించారు. నవంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్‌కు బయల్దేరుతారు. ఈ పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణాన్ని, ప్రభుత్వ విధానాలను, అందుబాటులో ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa