తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారిందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... 16 నెలల పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల కాలకేయుల్లా మారారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ మహిళా నేత కృపాలక్ష్మిపై అత్యంత నీచంగా మాట్లాడిన ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని, సీఎం చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ... టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీగా మార్చేశారు. ఎంత మంది మహిళలను వేధించినా, అవమానించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల మద్దతు ఉంటుందన్న ధైర్యంతో సభ్యత, సంస్కారం మరిచి ప్రవర్తిస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ జీ డీ నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మిపై ఎమ్మెల్యే థామస్ అత్యంత సంస్కారహీనంగా మాట్లాడారు. ఒక దళిత మహిళపై ఇంత నీచంగా ఎమ్మెల్యే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు. మహిళలపై ఎంత నీచంగా మాట్లాడినా వారి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమీ అనరన్న దైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే ధామస్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ ఇంట్లో మహిళల గురించి కనీస సభ్యత లేకుండా ఇంత నీచంగా మాట్లాడగలరా ? మీ మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు మౌనంగా ఉంటారా? అడ్డదారిలో ఈవీఎంల సాయంతో ఎమ్మెల్యే అయిన థామస్.. లంచం లేనిదే నియోజకవర్గ ప్రజలకు ఏ పని చేయరని చెప్పుకుంటున్నారు. దేవుడి అంటే కూడా ఆయనకు లెక్కలేదు. అలాంటి వ్యక్తి మహిళలకు గౌరవం ఇస్తాడని ఆశించడం లేదు. జీ డీ నెల్లూరు వైయస్ఆర్‌సీపీ నేత కృపాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ కచ్చితంగా క్షమాపణ చెప్పాలని, ఇంత దారుణంగా మహిళ మీద దుర్భాషలాడిన అతని మీద చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ తో పాటు, ఎస్సీ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నాం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa