భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం శుక్రవారం చెన్నైలో తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే, క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం ఈ బెదిరింపు కేవలం ఉత్తిదేనని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.వివరాల్లోకి వెళితే... చెన్నైలోని ఎస్టేట్ పోలీస్ స్టేషన్‌కు ఈ రోజు ఒక ఈమెయిల్ వచ్చింది. నగరంలోని మైలాపూర్ ప్రాంతంలో ఉన్న ఉపరాష్ట్రపతి నివాసంలో బాంబు పెట్టినట్లు ఆ మెయిల్‌లో ఉంది. ఈ హెచ్చరికను ఉన్నతాధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించారు. వెంటనే సీనియర్ పోలీసు అధికారులు, బాంబ్ డిటెక్షన్ నిపుణులు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి హుటాహుటిన రంగంలోకి దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa