ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజు రోజుకు కఠినంగాహెచ్-1 బీ వీసా నిబంధనలు,,,అమెరికా జీవితాన్ని బంగార పంజరంతో పోలిక

national |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 09:02 PM

ఒక మాజీ ఎన్ఆర్ఐ రెడిట్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ‘ఇండియాకి తిరిగి వచ్చినా నేను ఎందుకు బాధపడటం లేదు’ (Why I don't regret moving back to India) అనే టైటిల్‌తో ఆయన పోస్ట్ పెట్టారు. అసలు విషయం ఏంటంటే... అమెరికాలో H-1B వీసా కోసం పడే కష్టం, ఆ స్ట్రెస్ మామూలుగా ఉండదు. వీసా ఒత్తిడి, గ్రీన్ కార్డ్ లొల్లి, ఇంట్లో వాళ్లని చూడాలంటే లాంగ్ ట్రావెల్... వీటి మధ్య అక్కడ జీవన శైలి అతడికి 'బంగారు పంజరం' లా అనిపించాయట. అందుకే, ఆ 'H1B grind' నుంచి బయటపడాలని డిసైడ్ అయ్యాడు!


మన బ్రో తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. 2020లో (సరిగ్గా కోవిడ్-19 లాక్‌డౌన్‌కి ముందే!) తన జాబ్ ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ ద్వారా భారత్‌కు వచ్చేశాడు. అప్పటినుంచి అతడి జీవితం "crazy but rewarding" (కొంచెం పిచ్చిగా ఉంది కానీ బాగా రివార్డింగ్‌గా ఉంది) అని చెబుతున్నాడు. అమెరికా నుంచి వచ్చిన మాజీ ఎన్ఆర్ఐ మొదట బెంగళూరులో ఉన్నా, ఆ తర్వాత హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడి లైఫ్‌ని చూసి అతను షాక్ అయ్యాడంట! ఎలా అంటే, విదేశాల్లో ఉన్న టెన్షన్‌తో పోలిస్తే ఇండియా లైఫ్ చాలా ప్రశాంతంగా అనిపించిందంట.


అతడికి ఇండియాకి రావడం వల్ల దొరికిన అతిపెద్ద బహుమతి మనశ్శాంతి. ఎందుకంటే, కుటుంబ సభ్యులకి దగ్గరగా ఉండటం, వాళ్లతో విలువైన సమయం గడపడం వల్ల వచ్చిన సంతోషం ముందు అమెరికా జీవితం దిగదుడుపే అనే ఫీలింగ్ అతనికి కలిగింది. పైగా, ఇండియాలో తనకు మంచి జాబ్ ఉండటం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా మెరుగయ్యాడట. ఇమ్మిగ్రేషన్ కష్టాల్లో చిక్కుకుపోయే బదులు, ఇక్కడ స్వేచ్ఛగా బతకడం గొప్పగా ఉందని చెబుతున్నాడు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా ఫీజును ట్రంప్ లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే.


ఇండియా అంటే కొన్ని సవాళ్లు ఉంటాయి కదా! ఈ మాజీ ఎన్ఆర్ఐ కూడా వాటిని ఒప్పుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ జనాలు వ్యక్తిగత విషయాలు అడగడం, అనవసరమైన కామెంట్లు చేయడం లాంటివి కొంచెం ఇబ్బంది పెట్టాయట. కానీ, వాటిని చిన్నవిగానే కొట్టిపారేశాడు. విదేశాల్లో వీసా స్ట్రెస్, ఒంటరితనం ముందు ఇవి పెద్ద లెక్కే కాదని అతడు తేల్చేశాడు. ఏది ఏమైనప్పటికీ ఇది నా మాతృభూమి అని ఎమోషనల్ అయ్యాడు. ఇక్కడ పెరిగాం కాబట్టి, ఇక్కడి వ్యవస్థ ఎలా పనిచేస్తాయో మనకు తెలుసు, కాబట్టి చిన్న చిన్న సమస్యలు రోజువారీ జీవితంలో భాగమే అంటున్నాడు.


ప్రస్తుతం ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. చాలా మంది రెడిట్ యూజర్లు ఇతడి నిర్ణయాన్ని మెచ్చుకున్నారు, చాలా మంది తమకు కూడా వీసా స్ట్రెస్ నుంచి రిలీఫ్ దొరికిందని కామెంట్లు పెట్టారు. అతని చివరిగా ఇచ్చే సందేశం ఒక్కటే:‘అవకాశం ఉంటే, వెనక్కి వచ్చేయండి, స్వేచ్ఛగా బతకండి, మనశ్శాంతితో జీవించండి!’ మొత్తానికి, అమెరికా H-1B గ్రిండ్ వర్సెస్ ఇండియా పీస్ ఆఫ్ మైండ్ డిబేట్‌లో మన మాజీ NRI సోదరుడు భారత్‌కే గట్టిగా ఓటేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa