AP: కృష్ణా జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మొవ్వ మండలం నిడుమోలు గ్రామానికి చెందిన పలువురు నాయకులు టీడీపీకి గుడ్ బై చెప్పి , వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని అనిల్ కుమార్ హామీ ఇచ్చారు. వైసీపీకి ప్రజల్లో లభిస్తున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa