AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణ ఘటన జరిగింది. 9వ తరగతి చదువుతున్న సుశాంత్ అనే విద్యార్థి గొంతును దుండగుడు బ్లేడ్‌తో కోసి పరారయ్యాడు. సుశాంత్ తోటి విద్యార్థులతో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గొంతుపై తీవ్ర గాయాలైన ఆ విద్యార్థిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa