AP: విశాఖ నగరం అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. మంగళవారం విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై విశ్లేషణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా విశాఖలో అభివృద్ధికి మొదటి అడుగు పడింది. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడి పెడుతోంది. సెమీ కండక్టర్ పరిశ్రమలకు ఏపీ హబ్‌గా మారబోతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారు’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa