ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుప్పెడు పొట్టే కదా అని లైట్ తీస్కోవద్దు, గుండె సమస్యలతో పాటు ఎన్నో ప్రమాదసమస్యలొస్తాయిc

Life style |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 11:00 PM

​బెల్లీ ఫ్యాట్. ఇది చాలా మందికి ఉండే సమస్యే. కాస్తా తిన్నా, లేదంటే కొద్దిగా బరువు పెరిగినా ముందుగా బెల్లీ ఫ్యాట్ ముందుకొచ్చేస్తుంది. దీనిని కవర్ చేసుకోవడానికి ఎంతగానో కష్టపడతాం. దీని వల్ల అందంగా కనిపించకపోవడం మాత్రమే కాదు. మరెన్నో సమస్యలు ఉంటాయి. అందుకే, బెల్లీని తగ్గించుకోవాలి. అసలు బెల్లీ కారణంగా ఎలాంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయో ముందుగా తెలుసుకోండి. దీంతో ఓ అవగాహన వచ్చి చాలా వరక బెల్లీని తగ్గించుకుంటారు. బెల్లీ కామన్ అని అలా నిర్లక్ష్యం చేయకండి ఇది పెరిగితే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది.


గుండె సమస్యలు


బెల్లీ ఫ్యాట్ కారణంగా బెల్లీ చుట్టూ ఉండే అవయవాల్లో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. దీని వల్ల బ్లడ్ ప్రెజర్, గుండె సమస్యలు, స్ట్రోక్ వంటివి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఎప్పటికప్పుడు కూడా బెల్లీని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. బెల్లీ పెరిగిందంటే గుండెకి ప్రమాదం పొంచి ఉన్నట్లే. కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, గుండె సమస్యలు రాకుండా ఉండాలన్నా ముందుగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోండి.


హార్మోనల్ ప్రాబ్లమ్స్


బెల్లీ ఫ్యాట్ కారణంగా విజెరల్ ఫ్యాట్ పెరుగుతుంది. దీని వల్ల ఈస్ట్రోజెన్, ఇన్సులిన్, కార్టిసాల్ లెవల్స్ పెరిగి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ఆడవారికి ముఖ్యంగా ఇరెగ్యులర్ పీరియడ్స్, అలసట, బరువు పెరగడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి, ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు బెల్లీని పెంచుకోకుండా చూడండి.


టైప్ 2 డయాబెటిస్


బెల్లీ ఫ్యాట్ కారణంగా మీ కణాలకి ఇన్సులిన్ నిరోధకతని కలిగిస్తుంది. రోజులు పెరిగేకొద్దీ, ఇది హై బ్లడ్ షుగర్ లెవల్స్, డయాబెటిస్‌కి కారణమవుతుంది. డయాబెటిస్ కారణంగా అదనపు సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి, బెల్లీ ఫ్యాట్ పెరగకుండా చూడండి. షుగర్ పెరిగితే ఆటోమేటిగ్గా బాడీలో ఇతర అవయవాలపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి, షుగర్ పెరగకుండా జాగ్రత్తగా పడాలి.


జీర్ణ సమస్యలు


బెల్లీ ఎక్కువగా ఉంటే చాలా సమస్యలొస్తాయి. దీని వల్ల బెల్లీ చుట్టూ ఫ్యాట్ పెరిగి ఆహారం జీర్ణమవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. గట్ బ్యాక్టీరియాపై ఎఫెక్ట్ పడి బ్లోటింగ్, అజీర్ణం, మెటబాలిజంపై ఎఫెక్ట్ పడుతుంది. జీర్ణ సమస్యలు రావడానికి ముఖ్య కారణాల్లో ఒకటి బెల్లీ ఫ్యాట్. కాబట్టి, బెల్లీని తగ్గించుకోండి.


బెల్లీ ఫ్యాట్‌తో వచ్చే సమస్యలు


​ఇన్‌ఫ్లమేషన్, ఏజింగ్, మానసిక సమస్యలు


బెల్లీ ఫ్యాట్ కారణంగా బాడీలో ఇన్‌ఫ్లమేషన్, మోలక్యూల్స్ రిలీజ్ అవుతాయి. వీటి కారణంగా త్వరగా వయసు పెరిగినవారిలా కనిపించడం, కొల్లాజెన్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దీంతో మీ స్కిన్ డల్‌గా టైర్డ్‌గా కనిపిస్తుంది. చర్మ డల్‌గా కనిపించడానికి కారణమవుతుంది. అధ్యయనాల ప్రకారం విసెరల్ ఫ్యాట్ కారణంగా హై కార్టిసాల్, వాపుతో ఆందోళన పెరుగుతుంది. దీంతోపాటు మానసిక స్థితిలో మార్పులు, బ్రెయిన్ పనితీరు తగ్గుతుంది. కాబట్టి, బెల్లీ ఫ్యాట్‌ని ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa