ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025 షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. అక్టోబర్ 24న నుంచి నవంబర్ 23 వరకు ఆన్లైన్ దరఖాస్తులు కొనసాగుతాయి. నవంబర్ 25న ఆన్లైన్ మాక్ టెస్ట్ నిర్వహిస్తారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10న రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ రాత పరీక్షలు నిర్వహించి జనవరి 19న టెట్ ఫలితాలు వెల్లడిస్తారు. రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ రాసేందుకు అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa