అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, అదానీ గ్రూప్‌కు మద్దతుగా LIC దాదాపు రూ.33వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత ప్రభుత్వం ప్రతిపాదన చేసిందని ఆరోపించింది. అయితే, ఈ కథనాన్ని LIC ఖండించింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు బీజేపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్లమెంటరీ కమిటీ స్థాయిలో విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. దేశ ప్రజల పొదుపు నిధులను ప్రైవేట్ సంస్థల కోసం రిస్క్‌లో పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa